మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం). ఏదులపురం కొత్త మున్సిపాలిటీగా ప్రకటిస్తూ ప్రభుత్వం రాజ పత్రాన్ని విడదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపాలిటీ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ క్రాస్ రోడ్ సెంటర్ లో బాణ సంచాలు కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య సురేష్ నాయక్, మద్దినేని బేబి స్వర్ణ కుమారి, హరినాథ్ బాబు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొన్నారు.

Source:mana tv6 news