మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 25/03/2025 బుధవారం) ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలంలోని కల్లూరు గూడెం గ్రామంలో త్వరలోనే పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మంగళవారం సాయంత్రం కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టబోయే స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం తెలియజేశారు. పామాయిల్ ఫ్యాక్టరీకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ఫ్యాక్టరీ దారికి భూములు అందించిన రైతు సోదరులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఈ విలేకరులతో సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయకుమార్ మాట్లాడుతూ….
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కృషి తో ఈ నూతన పామాయిల్ ఫ్యాక్టరీ మన సత్తుపల్లి నియోజకవర్గానికి తీసుకురావడం జరిగిందని అన్నారు అన్నారు.
ఈ నూతన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం వలన వేంసూరు మండలం కల్లూరు గూడెం గ్రామం ఎంతో అభివృద్ధి జరుగుతుందని, ముఖ్యంగా రైతు సోదరులకు ఈ పామాయిల్ ఫ్యాక్టరీ ఓ గొప్ప వరం లాంటిదని తెలిపారు.. ఈ పామాయిల్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించడం వలన మండలంలో, చుట్టుపక్కల పామాయిల్ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
ఈ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అన్ని విధాల సహకరిస్తున్న ఉప ముఖ్య మంత్రివర్యులు బట్టి విక్రమార్క కి, రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుకి, రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
ముఖ్యంగా గ్రామ ప్రజలు ఎటువంటి అపోహాలు పెట్టుకోవద్దని, ఈ పామాయిల్ ఫ్యాక్టరీ నూతన టెక్నాలజితో నిర్మించడం జరుగుతుందని ఎటువంటి కాలుష్యం వాటిల్లదని అన్నారు. కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించడం వలన స్థానిక నిరుద్యోగులకు నాన్ టెక్నికల్ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా మేము గెలిచిన తర్వాత నూతన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, నూతన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం మా అదృష్టంగా భావిస్తున్నామని ఇది రైతు సోదరులకు, విద్యార్థులకు అందుతున్న ఓ గొప్పవరం. అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సత్తుపల్లి స్థానిక ఎమ్మెల్యేగా డాక్టర్ మట్టా రాగమయి కృషి అభినందనీయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ ఎఎంసి చైర్మన్లు దోమ ఆనంద్ బాబు, భాగం ఎర్రజ ప్రభాకర్, వైస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అధికారులు, సత్తుపల్లి నియోజకవర్గం 5 మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు,వేంసూరు మండలం, కల్లూరు గూడెం గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వేంసూరు మండలం, కల్లూరుగూడెం రైతు సోదరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.