➡️ హామీలు అమలు కోరితే అక్రమ అరెస్టులా ?
➡️మహిళలని చూడకుండా ఆశాలను గాయ పరిచారు.
➡️ ఆశయాలకు రేవంత్ సర్కారు క్షమాపణ చెప్పాలి.
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 27/03/2025 గురువారం).ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అధికారం చేపట్టిన తరువాయి మరిచారని సీపీఐ(ఏం) జిల్లా కమిటి సభ్యులు చలమాల విఠల్ రావు ఆరోపించారు.బుదవారం ఖమ్మంజిల్లా పెనుబల్లి మండల పరిధిలోని వి.ఎం.బంజర్ లోని చలమాల సూర్యనారాయణ భవనంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన మండల కమిటి సమావేశంలో ఘనంగా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు చలమాల విట్టల్ రావు ముఖ్యఅతిథిగా ఇచ్చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దె నెక్కి ఏడాది దాటినా ఆరు గ్యారెంటీలు సక్రమంగా అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు.హామీలపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చట్టబద్ధంగా, శాంతియుతంగా హైదారాబాద్ లో ఆందోళనలు చేస్తున్న ఆశాలను, వి.ఓ.ఏ.లను అడ్డుకొని మహిళలని చూడకుండా ఈడ్చుకెళ్లి అరెస్టులు చేయడం హేయమైన చర్య అని తక్షణమే రేవంత్ రెడ్డి సర్కారు క్షమాపణ చెప్పాలని విఠల్ డిమాండ్ చేశారు.
అంతే కాకుండా అసంఘటిత రంగంలో పని చేస్తున్న హమాలీ,బిల్డింగ్,పుట్ పాత్, టైలరింగ్,రవాణా కార్మికుల సమస్యలపై, వి.ఆర్.ఏ.ల సమస్యలపై చలో ఇందిరా పార్క్ కు వెళ్లకుండా అన్ని మండలాల్లో అరెస్టులు చేసి ఉద్యమాలను అడ్డుకోవాలని చూశారని అంతకన్నా బలంగా ఆందోళనలు చేసి కార్మికులు తమ సత్తా చూపించారని విటల్ రావు అన్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. అనునిత్యం బాధిత ప్రజలను చైతన్యం చేసి ప్రజా సంఘాల నాయకత్వంలో పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఎం డివిజన్ కమిటీ సభ్యురాలు మిట్టపల్లి నాగమణి, మండల కమిటీ సభ్యులు కండే సత్యం, తడికమళ్ళ చిరంజీవి, భూక్యా ప్రసాద్,చిలకా రామచంద్రుడు, నల్లమల్ల అరుణ్ ప్రతాప్, చలమాల నరసింహారావు, గుడిమెట్ల బాబు పాల్గొన్నారు.
