మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 21/02/2025 శుక్రవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర్ సప్తపది ఫంక్షన్ హాల్ సమీపంలో 21వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
కల్లూరు మండలం ముచ్చారం గ్రామానికి చెందిన పసుపులేటి పుల్లారావు (30సం) సత్తుపల్లి డిపోకు చెందిన టిఎస్04 యుడి1113 అనే నెంబర్ గల బస్సు ఖమ్మం నుండి సత్తుపల్లి వెళుతుండగా బస్సు ఎక్కిన పుల్లారావు ఫుడ్ బోర్డ్ లో నిలుచొని ప్రయాణం చేస్తున్నాడు.
విఎం బంజర్ సప్తపది ఫంక్షన్ హాల్ సమీపంలో బస్సులో మెట్ల దగ్గర నిలుచొని ప్రయాణిస్తున్న పుల్లారావు ఒక్కసారిగా అదుపు తప్పి బస్సులో నుండి కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. పుల్లారావుకు పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పుల్లారావు గత కొన్ని సంవత్సరాలుగా అద్దె బస్సు డ్రైవర్ గా సత్తుపల్లి బస్ డిపోలో పనిచేస్తున్నాడు.
