మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 22/02/2025 శనివారం).ఢిల్లీ ముఖ్యమంత్రి గా ఆర్యవైశ్య సోదరి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా 21వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పెనుబల్లి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో రేఖ గుప్తాకి అభినందన సభ ఎర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మిత్రుల తో కలిసి పాల్గొన్న బీజేపీ జాతయ నాయకులు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల సహా ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అన్ని కులాలకు మతాలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం వికసిత్ భారత్ గా అవతరిస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇవి రమేష్, సత్తుపల్లి అసెంబ్లి అభ్యర్థిగా పోటీ చేసిన నంబూరి రామలింగేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నే ఉదయ్ ప్రతాప్, పుల్లారావు యాదవ్, పాలేరు అసెంబ్లి అభ్యర్థిగా పోటీ చేసిన నున్నా రవికుమార్, మధిర అసెంబ్లి అభ్యర్థిగా పోటీ చేసిన విజయరాజ్, నెల్లూరి కోటేశ్వరరావు, పెనుబల్లి మండల అధ్యక్షుడు బొర్రా నరిసింహరావు పాల్గొన్నారు.
