మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 22/02/2025 శనివారం) సత్తుపల్లి మండలంలోని కిష్టారం గ్రామంలో జనావాసాల మధ్య సింగరేణి నిర్మించిన సైలో బంకర్ నుంచి వెలుబడుతున్న కాలుష్యాన్ని నివారించడంలో సింగరేణి యాజమాన్యం విఫలమైంది.
ఈ సైలో బంకర్ ను తక్షణమే తొలగించాలని గత 12 రోజుల నుంచి కిష్టారం అంబేద్కర్ నగర్ వాసులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల సహా ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖమ్మం జిల్లా బిజెపి నాయకులతో కలిసి రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కిష్టారం అంబేద్కర్ నగర్ కాలని వాసులకు 21 వ తేదీ శుక్రవారం మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ నగర్ వాసుల సమస్యను బొగ్గు గనుల శాఖ మాత్యులు జి కిషన్ రెడ్డి దృష్టికి, దేశ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకెళ్తానని వారికి సత్వర న్యాయం జరిగేలా చూస్తానని గ్రామ ప్రజలకు పొంగులేటి సుధాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇవి రమేష్, సత్తుపల్లి అసెంబ్లి అభ్యర్థిగా పోటీ చేసిన నంబూరి రామలింగేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నే ఉదయ్ ప్రతాప్, పుల్లారావు యాదవ్, పాలేరు అసెంబ్లి అభ్యర్థిగా పోటీ చేసిన నున్నా రవికుమార్, మధిర అసెంబ్లి అభ్యర్థిగా పోటీ చేసిన విజయరాజ్, నెల్లూరి కోటేశ్వరరావు, పెనుబల్లి మండల అధ్యక్షుడు బొర్రా నరిసింహరావు పాల్గొన్నారు.