మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18/04/2025 శుక్రవారం).నూతనంగా నీలాద్రిశ్వర స్వామి టెంపుల్ ఇఒఉద్యోగ బాధ్యతలు చేపట్టినటువంటి రజనీకుమారి గురువారం స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులను మర్యాదపూర్వక కలిశారు.
ఇఒ రజిని కుమారి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కు పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఇఒ రజినీకుమారితో నీలాద్రి స్వామి ఆలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల గురించి చర్చించారు.
ఈ కార్యక్రమంలో నీలాద్రిశ్వర దేవస్థానం చైర్మన్ చీకటి చిన్న నరసింహారావు, మిట్టపల్లి కిరణ్ కుమార్, కరిముల్లా, సత్తుపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పసుమర్తి విశ్వనాథ్, రామిశెట్టి శ్రీను, మనోహర్, వంగ నిరంజన్ గౌడ్, భూక్య ప్రసాద్, గోగినేని రమేష్, మేకతోట్టి కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
