మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 28/05/2025 బుధవారం). అతనొక మహోన్నతమైన వ్యక్తి సినీ రాజకీయ రంగాల్లో రాబోయే తరాలకు ఆదర్శప్రాయుడైకృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని నిరూపించిన నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని మన టీవీ సిక్స్ న్యూస్ తరపున వారికి ఇవే ఘన నివాళులు…..
నందమూరి తారక రామారావు 1928 మే 28న జన్మించి, 1996 జనవరి 18న తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గురించి మరొకసారి తెలుసుకుందాం తెలుగు ప్రజలు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 300 చిత్రాల పైగా నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్య భరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. ఏ పాత్ర అయినా సరే తనలో ఒదిగి పోవాల్సిందే అన్నట్టుగా నాయకుడిగా ప్రతి నాయకుడిగా రాముడుగా రావణుడిగా కృష్ణుడిగా అర్జునుడిగా దుర్యోధనుడిగా పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు.
దివిసీమను తుఫాను ముంచేత్తినప్పుడు నేనున్నానంటూ ముందుండి నడిపించిన లారీ డ్రైవర్ గా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే జస్ట్ చౌదరిగా ఒక యుగం తలుచుకునే యుగపురుషుడిలా ఏ కథలోనైనా మెప్పించే కథానాయకుడుగా ప్రేక్షకుల మనసు దోచుకున్న గజదొంగ నందమూరి తారక రామారావు. ఆయన 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలు, 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు.