మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మన కోసం 27/05/2025 మంగళవారం). జాతీయ రహదారిపై పశువులను నిర్లక్ష్యంగా వదిలివేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్ రెండు జాతీయ రహదారుల కూడలి. ప్రతినిత్యం కొన్ని వేల వాహనాలు ఈ రెండు జాతీయ రహదారులపై ప్రయాణిస్తుంటాయి. అటువంటి ఈ జాతీయ రహదారులపై పశువులు పదుల సంఖ్యలో ఎల్లవేళలా దర్శనమిస్తుంటాయి. రోడ్లపై పశువులు గంటల తరబడి నిలబడి ఉండడం, పడుకోవడం, వాటిలో అవి పోట్లాడుకుంటూ ఉంటాయి. ఇలా పశువులు రోడ్లపై ఉండడంతో అనునిత్యం కొన్ని వేల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మరికొన్నిసార్లు ఈ పశువులతో ప్రమాదాల సంభవిస్తున్నాయి. పశువుల యజమానులు తమ పశువులను నిర్లక్ష్యంగా రోడ్లపై వదిలేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి.సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పశువుల యజమానులను గుర్తించి వారికి అవగాహన కల్పించి రోడ్లపై పశువులు తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.