మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-01-2025 గురువారం). ఖమ్మం జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ కళావతి పెనుబల్లి మండల పరిధిలోని లంకాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా హాస్పటల్ ఆవరణలో మండల వైద్యాధికారి కిరణ్ కుమార్, హాస్పటల్ సిబ్బందితో కలిసి డాక్టర్ కళావతి మొక్కను నాటారు. హాస్పటల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్, వ్యాక్సిన్ స్టోరేజ్ రూమ్, ఇన్ పేషెంట్ వార్డ్, ల్యాబ్ ను పరిశీలించారు. హాస్పటల్లో నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డ్స్ ను వెరిఫై చేసి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారని డాక్టర్ కళావతి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ఆరోగ్య సేవాలు, సేవ కార్యక్రమాలు రోగులకు అందేలా చూడాలని, లంకసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్ని విభాగాలలో , కార్యక్రమాలలో ఖమ్మం జిల్లాలోనే మొదట ఉండేలా హాస్పటల్ సిబ్బంది మొత్తం పనిచేయాలని డాక్టర్ కిరణ్ కుమార్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ దుర్గా హెచ్డి సాంబశివారెడ్డి సిహెచ్ఓ పోలమ్మ పిహెచ్ఎన్ సుగుణ పిహెచ్సి స్టాఫ్ సూపర్వైజర్ తదితరులు పాల్గొన్నారు.
