♦️రజోత్సవ సభలో సత్తుపల్లి సత్తా చూపిద్దాం….
♦️ఎన్నికలు పెట్టి దమ్ము ప్రభుత్వానికి లేదు….
♦️అబద్ధాలు అంటేనే కాంగ్రెస్ అడ్డా…..
♦️రజతోత్సవ సభను విజయవంతం చేయండి. సభ పోస్టర్లను ఆవిష్కరణ…..
♦️మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య…..మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/04/2025 ఆదివారం).సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామంలో జరిగిన సన్నహక సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు పిలుపునిచ్చిన సండ్ర వెంకట వీరయ్య.
♦️పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామంలో కర్నాటి భూమారెడ్డి మామిడి తోటలో మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. సండ్ర వెంకట వీరయ్య మాటల్లోని ముఖ్యాంశాలు…..
♦️ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహించాబోతున్నామని,.ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని టిఆర్ఎస్ శ్రేణులకు సండ్ర పిలుపునిచ్చారు.
♦️నేడు రాష్ట్ర ప్రభుత్వం పాలన ఎలా ఉందో ప్రజలు చర్చించుకుంటున్నారు. పార్టీ రజోతోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని తెలిపారు.
♦️గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థ పూర్తిగా పడకేసిందని, మనం ఉన్నప్పుడు పచ్చగా కళకళలాడిన పల్లే ప్రకృతి వనం ఇప్పుడు ఎండిపోయాయని, పల్లె ప్రకృతి వనాలు నరికేసిన పట్టించుకునే నాథుడు లేడని, హెచ్ సి యు లో పర్యావరణం ప్రమాదం లో పడిందని తెలిపారు.
♦️కళ్యాణ లక్ష్మి పథకం కింద మనం చీరతో పాటు లక్ష చెక్కు ఇచ్చే వాళ్ళంమని, ఇప్పుడు కళ్యాణ లక్ష్మీ లేదు, షాది ముబారక్ లేదని తెలిపారు. అధికారంలోకి రావడం కోసం దళితులకు, రైతులకు మాయమాటలు చెప్పిరని, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి మీద ప్రణాళిక లేదని, పారిశుధ్యం మీద శ్రద్ధ లేదని తెలిపారు.
♦️కేసీఆర్ ఆనవాళ్లు చెరుపుదాం అనే ఆరాటమే తప్పితే అభివృద్ధి మీద దృష్టి లేదని, రైతు బంధు లేదు, రుణమాఫి లేదు పూర్తిగా అమలు కాలేదని ఒకప్పుడు సక్రమంగా వచ్చిన రైతుబంధు ఇప్పుడు ఎందుకు రావడం లేదని, ఇది వాయిదాల ప్రభుత్వం తప్ప అభివృద్ధి చేసే ప్రభుత్వం కాదని తెలిపారు.
♦️ప్రజలు, రైతులు రైతు కూలీల ఇలా అన్ని వర్గాల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది కేసీఆర్, కేటీఆర్ మాత్రమేనని సభముఖంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో కనగాల వెంకట్రావు, కూసంపూడి మహేష్, లక్కినేని వినీలు బాబు, లక్కినేని అలేఖ్య , మందడపు అశోక్, చెక్కిలాల మోహన్రావు, కోటగిరి సుధాకర్ బాబు, లగడపాటి శ్రీను, చిక్కిలాల లక్ష్మణరావు, నరుకుల్లా రాధాకృష్ణ, కనగాల సురేష్, నరుకుల సత్యనారాయణ, యలమర్తి శ్రీనివాసరావు, పర్సా వెంకట్ నారాయణ, మరకల చంటి, మరీదు చంద్రశేఖర్, మరకాల వెంకీ, టిఆర్ఎస్ అభిమానులు కార్యకర్తలు నాయకులు, గ్రామస్తులు, ప్రజలు పాల్గొన్నారు….
