మన టీవీ 6 న్యూస్ – ఖమ్మం టౌన్ (మన ప్రాంత వార్తలు మనకోసం20/06/2025 శనివారం). కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను 19వ తేదీ గురువారం ఖమ్మంలోని గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ హాజరై కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన వేడుకలు తెలియజేశారు. ఈ సందర్భంగా.. వారు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నిజమైన దార్శనికుడని, దేశ ప్రజల సంక్షేమానికి నిరంతరం పోరాడే సైనికుడని తెలిపారు. త్యాగధనుల కుటుంబపు ఆశా కిరణమని, అందరి శ్రేయస్సే మన ప్రియతమ నేత లక్ష్యమని పేర్కొంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్టణ కాంగ్రెస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
