మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం. (మన ప్రాంత వార్తలు మనకోసం 20/06/2015 శుక్రవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో అక్రమంగా మట్టి తరలించి లక్షల రూపాయల గడిస్తున్నరని అరోపణలు వినిపిస్తున్న అధికారులు మాత్రం నిమ్మకి నీరెత్తినటు వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇటీవల కాలంలో పెనుబల్లి మండలకేంద్రంతో సహా చౌడవరం మర్లకుంట, తాళ్లపెంట ఇలా చాలా గ్రామాల్లో భారీగా అక్రమంగా మట్టిని తరలించారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
సిసి రోడ్ల సైడ్ బెర్త్ ల కోసమని, ఇందిరమ్మ ఇళ్ల కొరకు అని, అభివృద్ధి అవసరాల కొరకు అని చెప్పి పట్టపగలే భారీగా మట్టిని ఇటుక బట్టీలకు, వెంచర్లకు ప్రతిరోజు కొన్ని వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించి లక్షల రూపాయల గడిస్తున్నారని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్న అధికారుల తీరు మాత్రం షరా మామూలేగా అన్నట్లుగా ఉందా ?…. కొందరు మండల స్థాయి అధికారులు అయితే ఇది మా బాధ్యత కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇటీవల సత్తుపల్లి పట్టణ కేంద్రంలో ఈ అక్రమ మట్టి తవ్వకాలపై నియోజకవర్గస్థాయిలో పెద్ద దుమారమే లేచింది. గత 15 సంవత్సరాలుగా ఎక్కడ మట్టితోలకాలు జరగనట్లు కేవలం గత రెండు సంవత్సరాల నుండి మట్టి తోలుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ మట్టి మాఫియా ప్రభుత్వం ఏదైనా తమ పని తాము దర్జాగా చేసుకుంటూ వెళుతున్నారనేది సమాజమెరిగిన సత్యం.