మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ ఆగస్టు 21 /25).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని మజీద్ యూటర్న్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచే ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో మండల పరిధిలోని లింగగూడెం గ్రామానికి చెందిన మంచాల పెద వెంకటేశ్వర్లు మజీద్ వద్ద ఉన్న యూటర్న్ గుండా సైకిల్ పై రోడ్డు క్రాస్ చేస్తూ ఆస్పటల్ వైపు వెళుతుండగా కొత్తగూడెం వైపు నుండి విఎం బంజర్ వైపు వెళుతున్న లింగగూడెం గ్రామానికి చెందిన పోట్రు విజయ్ బాబు కారు బలంగా ఢీకొనడంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు.

జ్వరంతో ఉన్న పెద వెంకటేశ్వర్లు చికిత్స నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది.వి.ఎం బంజర పోలీసులు కేసు నమోదు చేసే విచారణ చేపట్టారు.