మన టివి6 న్యూస్ – ఖమ్మం (లోకల్ న్యూస్ జూలై 5/25). టమాటో అనేది ఆంగ్లపదం. సొలనేసి కుటుంబానికి చెందిన విదేశీ కాయగూరజాతి. మొదట ప్రపంచంలో ఎక్కడ పుట్టిందో సరిగ్గా తెలీదు. కానీ అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతములనుండి ఇది వ్యాపించి ఉంటుందని అనుమానాలు ఉన్నాయి. దీనికి “సీమ వంగ, రామ ములగ” అని చక్కని తెలుగు పేర్లు ఉన్నాయి. కానీ ఈ తెలుగు పేర్లు మాత్రం ఎక్కడా వాడుకలో వినపడవు.
ఇంగ్లాండ్ నుండి భారతదేశములోకి సుమారుగా 1850 లలో ప్రవేశించిందని అనుకుంటున్నారు. ఇప్పుడు అనతి కాలంలోనే ఇది దేశీ కూరగాయల స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుకాణము చూడలేము. మనకు ఎక్కువగా లభించే ఎర్రగా అందంగా చూడముచ్చటగా కనిపించే టమాటోలు ఆరోగ్యానికు మేలు చేసస్తాయి . టమాటాలు శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి.
సాధారణంగా రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని చెపుతారు…. కాని అన్ని కాలాల్లో లభించే టమాటోలు తీసుకుంటే డాక్టరుతో అవసరముండదని చెప్పవచ్చు. దీనిలో “లైకోపీన్ ” అనే పదార్ధము శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతారు. (అంతర్జాల నుండి విషయ సేకరణ చేయబడినది.)