మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 19/02/2025 బుధవారం). ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం, వంగాముత్యాలబంజర్ గ్రామపంచాయతీ పరిధిలోని సోమ్ల నాయక్ తండ కు చెందిన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును 19 వ తేదీ బుధవారం బి.దివ్య అనే లబ్ధిదారుకు మండల కాంగ్రెస్ నాయకులు అందించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారు దివ్య మాట్లాడుతూమా ఆర్థిక పరిస్థితిని గమనించి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సకాలంలో స్పందించి తనకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, మండల కాంగ్రెస్ నాయకులు చీకటి రామారావు, మిట్టపల్లి కిరణ్ కుమార్, మేకతోటి కాంతయ్య, వంగా వెంకటేశ్వరరావు, వంగా నిరంజన్ గౌడ్, భూక్య ప్రసాద్, తేజావత్తు బాజీ నాయక్, భూక్యా పుల్లయ్య, భూక్య హాము, భూక్యరాంజా, గోగినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.
