మన టివి 6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 19/02/2025 బుధవారం) చింతకాని మండలం, రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పోలిశెట్టి. సుగుణ గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్ తో బాధపడుతూ ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆమె వైద్య ఖర్చులకు గత మూడు సంవత్సరాలుగా ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయినవి.
గత మూడు నెలల నుంచి క్యాన్సర్ తీవ్రతరం కావడంతో హైదరాబాద్ లోని బస్వతారకం క్యాన్సర్ ఆస్పత్రి లో చికిత్స చేయించుకుంటున్నారు. డాక్టర్ లు ట్రీట్మెంట్ మొత్తానికి యాభై లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. ఆనిరుపేద కుటుంబం వారు ఉంటున్న ఇల్లు కూడా అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించినారు. ప్రస్తుతం వైద్యానికి డబ్బులు లేక మెరుగైన ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేకపోతున్నారు. చికిత్స నిమిత్తం ఎవరైనా దాతలు ఉంటే స్పందించి ఆర్థికంగా సహకరించాలని నిండు ప్రాణాన్ని కాపాడాలని వేడుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ దృష్టికి రాగ తక్షణమే స్పందించి తన వంతు సహాయంగా 30 వేల రూపాయలు ఆనిరుపేద సుగుణ ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబానికి సహాయం చేయాలని సురేష్ నాయక్ కోరారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా వారితో పాటు పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు.ప్రద్యుమ్న చారి, ఎదులాపురం మున్సిపల్ నాయకులు కళ్లెం.శేష్ రెడ్డి,సత్తార్ తదితరులు పాల్గొంటున్నారు.
