❗తెలంగాణకు ద్రోహం బడా బాబులకు బొజ్జం….
❗ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది చలమాల విఠల్ రావు.
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 09/02/2025 ఆదివారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలంకపల్లి పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో సిఐటియు జనరల్ బాడీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు ఆధ్వర్యంలో గుడిమెట్ల బాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చలమాల విఠల్ రావు మాట్లాడుతూ, రేపు అనగా 10వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు కేంద్ర ప్రభుత్వం ఒకటవ తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నాను జయప్రదం చేయాలని విఠల్ రావు పిలుపునిచ్చారు.
సిఐటియు మండల నాయకులు గుడిమెట్ల బాబు మాట్లాడుతూ… కార్మికుల కనీస వేతనాల పెంపుదల గురించి గానీ, ఇతర శ్రామిక రంగాల మెరుగుదల గురించి గానీ, ఈ బడ్జెట్లో ప్రకటించలేదని, సుమారు 50 లక్షల 65 వేల 345 కోట్ల రూపాయల బడ్జెట్ ని ప్రవేశపెట్టిన, అందులో కార్మికుల ఊసే లేదని, పెట్టుబడిదారులకు బడా కంపెనీలకు రాయితీలు ఇచ్చే బడ్జెట్ గా ఉందని, రైతులను వ్యవసాయ కార్మికులను శ్రామిక వర్గాన్ని దగా చేసే ఈ బడ్జెట్ను వ్యతిరేకించాలని అన్నారు.
దానిలో భాగంగానే హైదరాబాదులో 10వ తేదీ సోమవారం మహా ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాను అందరు జయప్రదం చేయాలని విట్టల్ రావు, బాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గుడిమెట్ల బాబు, ఎస్ కె రాజి మిద్దె.స్వామి, మస్తాన్, ఎ.లక్ష్మయ్య, జి.వెంకటేశ్వర్లు, చీపి వెంకటేశ్వరావు, జి.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
