మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 17/04/2025 గురువారం). పెనుబల్లి మండల కేంద్రంలోని బిసి కాలనీకి చెందిన రాయల పుల్లయ్య (పోస్టు పుల్లయ్య) చిన్న కుమారుడు ఆర్ జె ప్రకాష్ గత సత్తుపల్లి డిపోలో అద్దె బస్ కు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
కల్లూరు మండలం బోడుమల్లె గ్రామానికి చెందిన ఉప్పు గండ్ల రామకృష్ణ సత్తుపల్లి డిపో టిఎస్ 04 యడి 0666 నంబర్ తో ఖమ్మం నుండి సత్తుపల్లి వెళుతున్న బస్సులో బుధవారం ప్రయాణిచాడు. ఈ సమయంలో 25000 విలువచేసే విఒ వై 28 తన మొబైల్ ను అనుకోకుండా బస్సులో పోగొట్టుకొన్నాడు. ఈ బస్సు డ్రైవర్ గా ఆర్ జె ప్రకాష్ ఉన్నాడు.
రామకృష్ణ బస్ దిగి వెళ్లిపోయిన తర్వాత మొబైల్ బస్ లో పోగొట్టుకున్నానని గమనించిన రామకృష్ణ తనకు కండక్టర్ ఇచ్చిన టికెట్ సహాయంతో ప్రకాష్ సంప్రదించగా బస్సులో తనకు ఫోన్ ఒకటి దొరికిందని చెప్పాడు. సత్తుపల్లి డిపో వద్ద అసిస్టెంట్ మేనేజర్ పి విజయశ్రీ, సుబ్బారావు సమక్షంలో రామకృష్ణ తగిన ఆధారాలు చూపించడంతో మొబైల్ ను తిరిగి ఇచ్చారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మొబైల్ దొరుకుతుందని అనుకోలేదని అన్నాడు. డ్రైవర్ ప్రకాష్ నిజాయితీతో నా మొబైల్ తిరిగి నాకు చేరిందని, ప్రకాష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నాడు. నిజాయితీతో వ్యవహరించిన ప్రకాష్ ను డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి అభినందించారు.
