- ప్రయాణంలోనూ అధికార పనిలో నిమగ్నం
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల ఆన్లైన్ గ్రీవెన్స్ సమావేశానికి ఆన్లైన్లో హాజరు
- సచివాలయం నుంచి సమావేశానికి హాజరు కావల్సి వున్నా.. ములుగులో గవర్నర్ పర్యటన నేపథ్యంలో ములుగు బయలుదేరిన సీతక్క
- ప్రయాణంలోనే ఉద్యోగుల సర్వీస్ సమస్యలు విన్న సీతక్క
- అధికారులకు దిశా నిర్దేశం చేసిన సీతక్క
- PRRD. శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నాం
- శాఖ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తక్షణం తీసుకుంటాం
- మంత్రివర్గం, పై స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలను నివేదించి పరిష్కారానికి కృషి చేస్తాం
- కొందరు అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారు
- మంచిర్యాలలో పింఛన్ కట్ చేయటం సరికాదు
- విచక్షణ మానవత్వం లేకుండా కొందరు సిబ్బంది పనిచేస్తున్నారు
- మీరు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకొని… ప్రభుత్వ మీద రుద్దితే చర్యలు తీసుకుంటాం
- పొరపాటు దొర్లితే సరిదిద్దుకోవాలి
- ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే.. విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం
Source:mana tv6 news