మన టివి6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 21/04/2025 సోమవారం.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన విఎం బంజర పోలీసులు. ఈ ఇద్దరు దొంగలను ఈ నెల 20 వ తారీఖు ఆదివారం వి ఎం బంజర్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్దనుండి 18 బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసిపి రఘు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట కు చెందిన మక్కెళ్ళ నాగరాజు (26), ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన చల్లా శివప్రసాద్ లుఅదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 18 ద్విచక్రవాహలను స్వాధీనం చేసుకున్నట్టు ఎసిపి రఘు తెలిపారు. నిందితుల దగ్గర నుండి వాహనాలను కొనుగోలు చేసిన మరో 8 మంది కూడ అదుపులోకి తీసుకుని వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రఘు తెలియజేశారు.