*రాయికోడ్ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ.
*6 గ్యారంటీల్లో భాగంగా జనవరి 26 నుండి నాలుగు ప్రతిష్టాత్మక పథకాల అమలు.
*స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం కృషి.
*పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం…..
సోమవారం రాయికోడ్ మండల కేంద్రంలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నూతన ఆలయ కమిటీ చైర్మన్ కులకర్ణి ప్రభాకర్, వైస్ చైర్మన్ గోవ్వ భీమన్న, సభ్యులు గా, పి బసవంతరావు, ఉప్పరి విటల్, బేకర్ కృష్ణవేణి, బి నర్సయ్య, జొన్నాడ దత్తరెడ్డి తదితరులు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదుని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేల చర్యలు చేపట్టిందన్నారు. అభివృద్ధి పథకాలలో భాగంగా రైతు భరోసా సంవత్సరానికి ఎకరాకు 12 వేల రూపాయలు ఈ నెల 26 నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ రాజకీయాలకతీతంగా ఇందిర ఇళ్ళు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం పాలకవర్గంతో కలిసి పనిచేయున్నట్లు మంత్రి తెలిపారు. రాయికోడు, కప్పాడ్ చౌరస్తా రోడ్డు 20 రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
రాయికోడ్ లో ప్రభుత్వ ఐటిఐ ఏర్పాటుకు కృషి చేయునట్లు మంత్రి తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాల, మోడల్ పాఠశాలలో సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, అవే స్థానిక ఎన్నికల్లో మన గెలుపును శాసిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మండల ప్రత్యేక అధికారి జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఆలయ ఈవో శివ రుద్రయ్య, ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
