భూక్యా సురేష్ నాయక్ మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 21-01-2025 మంగళవారం). 20వ. తేదీ సోమవారం ఎదులాపురం స్మశాన వాటిక పక్కనే డంపింగ్ యార్డులో స్థానిక సిబ్బంది నిర్లక్ష్యంగా చెత్త ను డంప్ చేస్తున్నారు. దీని వలన సమీపంలో వెళ్తున్న రైతులకు, అంత్యక్రియలకు వెళ్తున్న ప్రజలకు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య సురేష్ నాయక్ ఆరోపించారు.
ఈ డంపింగ్ యార్డ్ వలన సమీపంలోని చెరువు లోని నిళ్ళు కలుషితమై, ఆ నీళ్ళు తాగి పశువులు అనారోగ్యానికి గురవుతుండగా చేపలు చనిపోతున్నాయి. చెరువు మీద ఆధారపడిన మాత్యకార కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఈ డంపింగ్ యార్డ్ ను ఇక్కడ నుండి వేరే ప్రదేశానికి తరలించాలని స్థానిక రైతులు, ప్రజలు కోరుతున్నారని, ఈ విషయమై ఖమ్మం రూరల్ ఎంపిడిఒకి వినతి పత్రాన్ని అందిస్తున్నామని సురేష్ నాయక్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్, పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు. ప్రద్యుమ్న చారి, కళ్లెం.శేష్ రెడ్డి, కొక్కు.రాజు, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
