మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 21-01-2025 మంగళవారం). తెలంగాణ ప్రభుత్వంలో మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలు వివిధ ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసే విధంగా సదుపాయాలు కల్పిస్తుంది. మహిళా సమాఖ్యల వ్యాపార వృద్ధి కోసం శిల్పారామంలో ఇందిరా మహిళ శక్తి బజార్ ను ప్రారంభించారు. ఇక్కడ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో స్టార్ట్ అప్ కంపెనీల సేల్స్ ను ఏర్పాటు చేశారు. మహిళ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, మండల స్థాయి నుంచి హైదరాబాద్ వరకు స్వేచ్ఛగా మార్కెటింగ్ చేసుకునే విధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. రాజధాని హైదరాబాద్ లోనే కాదు ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో మహిళ సంఘాల ఉత్పత్తులు, మహిళా వ్యాపారవేత్తల ఉత్పత్తులను విక్రయించేలా అవకాశాలు కల్పిస్తున్నారు. మహిళలను 17 రకాల వ్యాపారాలను ప్రోత్సహిస్తు వేయి మెగావాట్ల సౌర విద్యుత్తును మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి చేయబోతున్నారు. మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబం సమాజం సంతోషంగా ఉంటుందని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా మహిళలు అభివృద్ధి మీదే సమాజాభివృద్ధి ఆధారపడి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం.
Mana Tv 6 News > Telangana > ప్రజా పాలనలో తెలంగాణ మహిళలు మహారాణులు కాబోతున్నారు..
ప్రజా పాలనలో తెలంగాణ మహిళలు మహారాణులు కాబోతున్నారు..

Source:mana tv6 news
the authorManatv6News_J SRINIVAS REPORTER
All posts byManatv6News_J SRINIVAS REPORTER