మన టివి6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 26/05/2025 సోమవారం).రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో, “తెలంగాణ రైజింగ్-2047” విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ 10 గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నీతి ఆయోగ్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి వైపు తెలంగాణ అంటూ వివరించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు.. 1971లో ఇందిరా గాంధీ నాయకత్వంలో పాకిస్థాన్‌ను ఓడించి, ఆ దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చిన చరిత్రను గుర్తుచేశారు. అలాగే మొత్తం 20 అంశాలను ప్రస్తావించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో, పేదల సంక్షేమం, పారదర్శక సుపరిపాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సమగ్ర పాలసీల రూపకల్పన వంటి నాలుగు కీలక అంశాలకు ప్రాధాన్యతనిస్తుంది. అలాగే రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించింది.
మరోవైపు బీసీలకు విద్య, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించింది. ఎస్సీల ఉప వర్గీకరణ చేపట్టి, 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. మహిళల పురోగతికి పెద్దపీట వేస్తూ, ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళా సంఘాలకు లక్ష కోట్ల రుణాలు వంటి పథకాలు ప్రారంభించిందని వివరించారు. యువత భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా 5 లక్షల స్వయం ఉపాధి రుణాలు అందిస్తుంది. తెలంగాణను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో 139 దేశాల్లో మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ అనే స్ఫూర్తితో, వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుంది సిఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.