మన టీవీ6 న్యూస్- ఖమ్మం ( మన ప్రాంత వార్తలు మనకోసం 27/05/2025 మంగళవారం). దరిపల్లి అనంత రాములు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఖమ్మం ఫౌండర్ చైర్మన్ స్వర్గీయ దరిపల్లి అనంత రాములు నాలుగో వర్ధంతి సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దరిపల్లి విద్యాసంస్థల అధినేత డాక్టర్ దరిపల్లి కిరణ్ అనంత రాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కిరణ్ మాట్లాడుతూ అనంత రాములు లాంటి మహోన్నత వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు, ఇన్స్టిట్యూషన్లో వారు చూపెట్టిన క్రమశిక్షణ, సమయస్ఫూర్తి, అందించిన సేవలను ఎప్పటికీ గుర్తుండిపోతాయని, వారి స్ఫూర్తితోనే ఇన్స్టిట్యూషన్ లో అందిస్తున్న కార్పొరేట్ విద్యలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులకు ఫీజులో రాయితీ ఇస్తున్నామని, ఒంటరి కుటుంబాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాలకి విచ్చేసిన కొత్తగూడెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ మైనింగ్ డిపార్ట్మెంట్ హెచ్వోడి కరుణ కుమార్ సార్, మైనింగ్ స్టాఫ్ ప్రసాద్ సార్, రవిచంద్ర, డేర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ విద్యాసాగర్, శివరాజ్, శ్రీనాథ్, కళాశాల సిబ్బంది శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ రాష్ట్ర నాయకులు కానుగుల రాధాకృష్ణ, జిల్లా ప్రెసిడెంట్ తిగుళ్ల రమణ, ఖమ్మం జిల్లా నాయకులు వెంకటేష్, సర్వేశ్వరరావు పాల్గొన్నారు.
