మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 14/02/2025 శుక్రవారం). సత్తుపల్లి లోని భారతీయ జనతాపార్టీ కార్యాలయం పై, సత్తుపల్లి మండలం అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్ పై దాడి ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సహా ఇంచార్జి, మాజీ ఎమ్మెల్సీ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖమ్మం సిపి సునీల్ దత్ నికోరారు. తప్పకుండా విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సిపి హామి ఇచ్చారు.
బిజెపికార్యాలయంపై , కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇలాంటి చర్యలకు పాల్పడితే చేస్తే సహించేది లేదని పొంగిలేటి సుధాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమని పేపర్లో వచ్చిన వార్తను సోషల్ మీడియాలో షేర్ చేస్తే తప్పేమున్నదని సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందేమీ లేదని ప్రజల గ్రహించి తిరగబడతారేమోనని అభద్రతా భావంతో ఇటువంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్నదని అన్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బిజెపిపార్టీ మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్, నియోజకవర్గ కన్వీనర్ వీరంరాజుని, పార్లమెంటు కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావుని ఫోన్లో అడిగి తెలుసుకొన్నారు. బిజెపి కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు అధిష్టానం ఎల్లవేళలా అండగా ఉంటుందని పొంగులేటి సుధాకర్ రెడ్డి బిజెపి శ్రేణులకు భరోసా ఇచ్చారు.
