మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 28/02/2025 శుక్రవారం) ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో 27వ తేదీ గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఖమ్మం పార్లమెంట్ బిజెపి అభ్యర్థి తాండ్ర వినోద్ రావు.
ఈ కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని తాండ్ర వినోద రావు సందర్శించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తాండ్ర వినోద రావు బిజెపి ఎంఎల్సి అభ్యర్థి పులి సర్వోతమరెడ్డి అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పనిచేసి, ప్రచారం నిర్వహించిన మండల బిజెపి కార్యకర్తలను నాయకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో పడిగల మధుసూదన్ రావు, బొర్రా నర్సింహారావు, ఓరుగంటి రాము, పేర్లు మహేష్, గాయం నాగరాజు, రామకృష్ణ, శ్రీ మంతుడు, బిజెపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.