మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 01/03/2025 శనివారం) ఫిబ్రవరి 28 శుక్రవారం ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా స్థానిక పెనుబల్లి మండల టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వి ఎం బంజర్ రింగ్ సెంటర్ వద్ద టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎస్.కె భాషా మాట్లాడుతూ ప్రస్తుత సమాజ పరిస్థితులలో టైలర్స్ జీవనం కొనసాగించడం చాలా కష్టంగా ఉందని అన్నారు. కార్పొరేటర్లు రెడీమేడ్ దుస్తుల వ్యాపారం నిర్వహించడంతో దర్జీల బ్రతుకులు దీనంగా మారాయి. టైలర్స్ ని ప్రభుత్వం ఆదుకోవాలని 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని, అలాగే టైలరింగ్ షాపులకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని, అన్ని సంక్షేమ పథకాలు టైలర్స్ కు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండలం సిపిఎం కార్యదర్శి గాయం తిరుపతి రావు మరియు సిఐటియు నాయకులు తాండ్ర రాజేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టైలర్స్ యూనియన్ నాయకులు, ఎస్ సత్యనారాయణ, బుర్రి వెంకటేశ్వరావు, షేక్ గౌస్, మండేపూడి కృష్ణ, బాలకృష్ణ, జానీ, సుబ్బారావు, గఫూర్, శ్రీను, తడికమళ్ళ చిరంజీవి, జిల్లెల్ల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
