మన టివి 6 న్యూస్ (మన జిల్లా వార్తలు మనకోసం 13/2/2025 గురువారం). ఖమ్మం రూరల్ మండలం ఏం వెంకటాయపాలెంకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రెంటాల.రమేష్ ఇటీవల క్యాన్సర్ కు గురై హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో చికిత్స పొంది, ఏం.వెంకటాయపాలెం లోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ వెంటనే స్పందించి రమేష్ ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆర్ధిక సహాయం అందజేశారు. రమేష్ కి, అతని కుటుంబానికి మనోధైర్యం చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారితో పాటు పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు, ప్రద్యుమ్న చారి, ఎదులాపురం మున్సిపల్ నాయకులు కళ్లెం.శేష్ రెడ్డి, ఖమ్మం రూరల్ మండల నాయకులు నాగండ్ల ఉపేందర్, పాపిట్ల.శ్రీను, గ్రామ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ, రాజ్ కుమార్, సురేష్, వెంకటేశ్వర్లు, యుగంధర్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
