మన టివి 6 న్యూస్ (మనప్రాంత వార్తలు మనకోసం 29/01/2025 బుధవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామానికి చెందినటువంటి కొప్పుల శిరీష కు (భర్త వెంకట రామారావు.) 29వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు పురిటి నొప్పులు వస్తున్నాయని ఆశ రమణ పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని 108 కి ఫోన్ చేశారు. హుటాహుటిన బయలుదేరిన 108 సిబ్బంది లింగగూడెంలోని శిరీష ఇంటికి వెళ్లారు. శిరీషను 108 లో ఎక్కించిన తర్వాత నొప్పులు ఎక్కువ కావడంతో ఆశా రమణ 108 సిబ్బంది రామకృష్ణ వేణు సహకారంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి వాహనం లోనే కాన్పు చేశారు. శిరీష పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. తల్లి బిడ్డను పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Source:mana tv6 news