మన టివి6 న్యూస్ – ఖమ్మం (మన ప్రాంత వార్తలు మనకోసం 23/06/2025 సోమవారం). సత్తుపల్లి మండలం బుగ్గుపాడు గ్రామ సమీపంలో 22 వ తేదీ రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
అన్నపురెడ్డిపల్లికి చెందిన వడ్డుబోయిన రాంబాబు, జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామానికి చెందిన కొప్పు శ్రీరాములు ఎదురుగా ద్విచక్ర వాహనాలతో ఢీకొన్నారు. దీనితో వీరి ఇరువురికి గాయాలు కావడంతో సమీపంలో ఉన్నవారు 108 కి ఫోన్ చేశారు. తక్షణమే స్పందించిన 108 సిబ్బంది టెక్నీషియన్ కృష్ణ , పైలెట్ రాజులపాటి రాధాకృష్ణ హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాంబాబు సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది.
సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల కృష్ణ. పైలెట్ రాజులపాటి రాధాకృష్ణ హుటా హుటిన సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో వైద్యం అందిస్తూ సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
