మన టివి6 న్యూస్ (మన జిల్లా వార్తలు మనకోసం31/01 శుక్రవారం). 30/1/2025 గురువారం ఇందిరా గాంధీ, ప్రజా గాయకుడు గద్దర్ పై భాజాపా కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి.శివ చరణ్ రెడ్డి ఆదేశానుసారం పాలేరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం, ఎదులాపురం మున్సిపాలిటీ, వరంగల్ క్రాస్ రోడ్డు సెంటర్ లో పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు భానోత్. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బండి.సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని డిమాండ్ చేయడం చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల.అంజనీ, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి కాస్థాల.క్రాంతి, పాలేరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇబ్రాహీం, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు కోటి.రమణ, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్, బనోత్.హరి, రవీందర్ ,సాయి, నవీన్, మహేష్, శివ, సాంబ, మనోజ్, మహేష్, మున్న, సీనియర్ కాంగ్రెస్ జిల్లా నాయకులు భూక్యా.సురేష్ నాయక్, ఎన్.పీ చారి, సీతారాములు, శేష్ రెడ్డి, రాజు, యువజన విభాగం నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
