మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 08-01-2025 బుధవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామానికి చెందిన ఉల్లాస వెంకటేశ్వరరావు (వయసు 58 సం.) 8 తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు పొలం వద్దకు వెళ్లాడు. అక్కడే సమీపంలోని నాగార్జునసాగర్ కాలువలో ప్రమాదవశాత్తు పడిపోవడంతో అసమయంలో అక్కడ ఉన్న వారు చూసి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సాగర్ కాలువలో పడిపోయిన వెంకటేశ్వరరావు వెతకగా మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు వి.ఎం బంజర్ పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Source:mana tv6 news