మన టివి సిక్స్ న్యూస్. (మన ప్రాంత వార్తలు మనకోసం గురువారం. Jan 09.2025). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 8వ తేదీ బుధవారం లబ్ధిదారులకు సుమారు 45 మందికి వారి ఇళ్ల వద్దకే వెళ్లి చెక్కులను ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న చెక్కులను, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కూడా పంపిణీ చేస్తున్నామని అన్నారు. పేద ప్రజలు గ్రామాల నుండి సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వచ్చి చెక్కులు తీసుకోవడం వారికి చాలా ఇబ్బందిగా ఉందని అందుకే స్వయంగా ఎమ్మెల్యేనైన తాను కాంగ్రెస్ నాయకులతో కలిసి గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు తిరుగుతూ చెక్కులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కాలంలోనే రైతులకు రుణమాఫీ చేసిందని, అలాగే సన్న ధాన్యానికి మద్దతు ధర ప్రకటించడంతో ప్రతి రైతుకు ఎకరానికి 10 నుంచి 15 వేల వరకు లబ్ధి చేకూరిందన్నారు. ఈనెల 26వ తేదీ నుండి రైతులకు రైతు భరోసా సంవత్సరానికి 12వేలు, భూమిలేని నిరుపేద రైతులకు కూలీలకు సంవత్సరానికి 12వేలు, కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే ఇస్తామని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం అభివృద్ధి పథకాలు సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమం లో కల్లూరు పెనుబల్లి ఎ.యమ్.సి చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, వైస్ చైర్మన్ రాజబోయన కోటేశ్వరరావు, పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వర రావు, రాధాకృష్ణ జగన్ సత్తుపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పసుమర్తి విశ్వనాధ్, అధికార ప్రతినిధి పొట్లపల్లి వెంకటేశ్వర రావు, పెనుబల్లి మండలం, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
