మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15-01-2025 బుదవారం). ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో పత్తి బస్తాలు అగ్నికి అహుత అయ్యాయి. ఈ అగ్ని ప్రమాదాలో సుమారు 400 పైగా పత్తి బస్తాలు తగలబడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం గురించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం మార్కెట్‌లో కొందరు వ్యాపారులకు చెందిన పత్తి బస్తాలు షార్ట్ సర్క్యూటే కారణంగానే కాలిపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హుటా హుటీన అధికార యంత్రాంగాన్ని సంఘటన స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌తో మాట్లాడి ఇతర అధికార యంత్రాంగాన్ని సైతం అప్రమత్తం చేశారు. మార్కెటింగ్, ఫైర్, పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి వెళ్ళిన పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయంమై నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నికైన యరగర్ల హన్మంతరావు, వైస్‌చైర్మన్ తల్లాడ రమేష్‌లను సైతం మార్కెట్‌ను సందర్శించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంటలు ఎలా వ్యాపించాయో, ఇందుకు గల కారణాలను సైతం క్షుణ్ణంగా తెలుసుకోవాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
