మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15-01-2025 బుదవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో 14 వ తారీకు మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని పార్థసారధిపురం గ్రామానికి చెందినటువంటి కేసర రాజారావు, కుంజ మహేష్ ద్విచక్ర వాహనంపై వియం బంజర్ నుండి వారి స్వగ్రామం వెళుతూ ఉన్న క్రమంలో రంగారావు బంజర గ్రామంలో ఆగి తెలిసిన వారితో మాట్లాడుతున్న సమయంలో వి.ఎం బంజర్ నుండి కొత్తగూడెం వైపు వెళుతున్న AP 28 DM 0090 నంబర్ గల స్కోడా కారు ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని వెనకవైపు నుండి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రాజారావు మరణించగా కుంజా మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం చేసిన కారు ప్రమాద స్థలంలో ఆపకుండ చండ్రుగొండ మండలం సమీపంలో వదిలేసి వెళ్లినట్లు సమాచారం. వి.ఎం బంజర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
