ఖమ్మం జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన భూక్య సురేష్ నాయక్.
మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13-01-2025 సోమవారం).
ఖమ్మం జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ జిల్లా ప్రజలందరికి హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల వాసులు, విదేశాలలో స్థిరపడిన, నివసిస్తున్న తెలుగు వారందరికి సురేష్ నాయక్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని, ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లోకి ఆనంద ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిరిసంపదలు అందించాలని అలాగే మీ కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను అని అన్నారు. విద్యార్థులు యువకులు పతంగులు ఎగరేసే సందర్భాలలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నానని భూక్యా సురేష్ నాయక్ తెలిపారు.
