భారత ప్రజాతంత్ర యువజన సమైక్య, మహిళా సంఘం ఆధ్వర్యంలో కెడబ్ల్యు చోడవరంలో ముగ్గుల పోటీ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి వి ఎం బంజర్ విజయలక్ష్మి ఫ్యాన్సీ, లక్ష్యస్కూల్ యాజమాన్యం పలగాని ఈశ్వర్, స్కై స్కూల్ కురువేటి రమేష్ బాబు బహుమతులకు ఆర్థిక సహకారం అందించారు. సిపిఎం కార్యవర్గ సభ్యులు చలమల విఠల్రావు, గాయం తిరుపతిరావు పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. బహుమతులు ఆర్థిక సహకారం అందించిన దాతలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అప్పారావు కార్యదర్శి, బుక్య ప్రసాద్, మహిళా సంఘ అధ్యక్షురాలు మిట్టపల్లి నాగమణి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బెజవాడ సాయి, పాల్గొన్నారు.

Source:mana tv6 news