మన టివి 6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 20/02/2025 గురువారం). 19 వ తేదీ బుధవారం ఎదులాపురం మున్సిపాలిటీ, పెద్దతండా లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ ఆధ్వర్యంలో, మోఫి మానసిక వికలాంగుల మధ్యలో ఖమ్మం ఎంపి రామసహాయం. రఘురాం రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు.దయాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి కేక్ కట్ చేశారు. దయాకర్ రెడ్డి, సురేష్ నాయక్ ఎంపీ రామసాహెబ్ రఘురామిరెడ్డికి చరవాణి ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దయాకర్ రెడ్డి చేతుల మీదుగా మానసిక వికలాంగులకు పళ్ళు, బ్రెడ్ అందించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మానసిక వికలాంగుల కేంద్రం నిర్వాహకురాలు ప్రమీల, ప్రియాంక, పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు, ప్రద్యుమ్న చారి, ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ నాయుకురాళ్ళు రాయల.కృష్ణ వేణి,ప్రతిభా రెడ్డి, సుకన్య, పి ఎస్ ఆర్ యూత్ అధ్యక్షులు దుంపాల.రవి కుమార్, ఎదులాపురం మున్సిపల్ నాయకులు కందుకూరు.వెంకట్నారాయణ, బుజంగ రెడ్డి, తోట.చిన్న వెంకట్ రెడ్డి, భాస్కర్,మోహన్, సంగయ్య, వెంకటేష్, శేష్ రెడ్డి, నగేష్, పుల్ల రావు, ఖాజా మియా, వెంకట్రములు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.
