మన టివి6 న్యూస్ – సత్తుపల్లి మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 20/05/2015 మంగళవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామంలో మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో జీలుగు విత్తనాలను సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వం అని, దేశంలో ఎక్కడ లేని విదంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు అద్భుతమైన పథకాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే రాగమయి అన్నారు.ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రివర్యులు బట్టి, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల, శ్రీ పొంగులేటి, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి రైతు భరోసా, రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా పథకం రైతులకు ఎకరాకు రూ. 12,000 పెట్టుబడి సాయం, రైతు బీమా పథకం ఇలాంటి అనేక రైతు పథకాలను అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రమంతటా రైతు సోదరులకు అందిస్తున్నారని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో సత్తుపల్లి అగ్రికల్చర్ ఎడి,సొసైటీ అధ్యక్షులు శివరాం ప్రసాద్, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వరరావు, కిలారి వెంకటేశ్వరరావు, కంచర్ల రమేష్, పువళ్ళ ఉమా, బేతిని బాబు, దొడ్డా సత్యం, పొదిలి మరేశ్వరరావు, పొదిలి శ్రీను, సొసైటీ కూరపాటి నాని, ఎఒ, ఎఇఒ, ప్రభుత్వ అధికారులు, సొసైటీ డైరెక్టర్ లు, సత్తుపల్లి మండలం, కాకర్లపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.