మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15/05/2015 గురువారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వేంసూరు మండలం లింగపాలెం గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ ఎగ్జిట్ పాయింట్ నుండి కల్లూరు మండలం లింగాల హైవే రోడ్ ఎగ్జిట్ పాయింట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ పనులను గురువారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తో కలిసి పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు పరిశీలించారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఒక నియోజకవర్గంలో హైవే రోడ్ పై మూడు ఎగ్జిట్ పాయింట్స్ ఇవ్వటం ఇదే ప్రధమం అని ఆ ఘనత మీ సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే రాగమయికి, సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలకు దక్కుతుంది అని తెలిపారు.