మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16/05/1025 శుక్రవారం).
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ బుడుగు జంగాల కాలనీలో శుక్రవారం ఉదయం ఆరు గంటలకు మోటం వెంకటేశ్వర్లు ఇంటిపై పిడుగు పడటంతో స్వల్ప ఆస్తి నష్టం జరగగా ఇటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ఉదయం పూట ఆరు గంటలకు పిడుగు పడటంతో కుటుంబ సభ్యులందరూ ఇంటిలోనే ఉన్నారు. కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇల్లు పాక్షికంగా దెబ్బ తినడంతో పాటు ఒక టివి, నాలుగు ఫ్యాన్లు, ఇంటి కరెంటు వైరింగ్ ధ్వంసం అయ్యాయి. సుమారు 50 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.
Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్