మన టివి 6 న్యూస్ (మనప్రాంత వార్తలు మనకోసం 08/02/2025 శనివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామం వద్ద సత్తుపల్లి ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది.
లంకపల్లి గ్రామానికి చెందిన నీలాల రమేష్ , ఎస్ కె జానీ ఇద్దరు శనివారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు ద్విచక్ర వాహనంపై వెళుతూ కొత్త లంకపల్లి సమీపంలో గేదెను ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది టెక్నీషియన్ రామకృష్ణ, పైలెట్ రాధాకృష్ణ సకాలంలో స్పందించి సమయస్ఫూర్తితో వ్యవహరించి క్షతగాత్రులను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Source:mana tv6 news