మన టివి6 న్యూస్ కొణిజర్ల మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 07/06/2025 శనివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సూర్య బంజర గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తనికెళ్ళ గ్రామానికి చెందిన లకావత్ చందు తండ్రి నాగ (14 సం.) మేనమామలు ప్రేమ్ కుమార్, మాలోత్ శివలతో కలసి ద్విచక్ర వాహనంపై వివాహానికి వెళ్లి వస్తుండగా సూర్య బంజర గ్రామం వద్ద ట్రాక్టర్ రివర్స్ చేసే క్రమంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో చందు తలకు బలమైన గాయం కావడంతో పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా హాస్పటల్ వైద్యులు, సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. అనంతరం 108 కి ఫోన్ చేయగా పైలెట్ శ్రీను టెక్నీషియన్ రామకృష్ణ తక్షణమే స్పందించి పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం 108 లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
