మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 24/03/2025 సోమవారం).సిఐటియు, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి సభను వి.ఎం బంజర్ లో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు భుక్య ప్రసాద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు, గాయం తిరుపతరావు, భూక్య ప్రసాద్,భగత్ సింగ్ చిత్రపటానికి పూలదండ వేసి, ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు పాల్గొని,మాట్లాడుతూ, భగత్ సింగ్ 94వ వర్ధంతి సభలో వి.ఎం.బంజర్ రింగ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించటం చాలా సంతోషమని, భారతదేశానికి భగత్ సింగ్ అవసరాన్ని గుర్తించటం, మంచి పరిణామం అని ఆయన అన్నారు.
భగత్ సింగ్ సమూల మార్పు వాది ఆయన తన ఆశయ సాధనకు దేశం కోసం తన ప్రాణాన్ని ఆయుధంగా వాడాడు. తుపాకులు బాంబులు, సమాజంలో మార్పును సృష్టించవని, విప్లవం అనే కత్తికి ఆలోచనలు అనే రాయిపై పదును పెట్టబడుతుందని బలంగా నమ్మి సమాజంలో విప్లవ జ్యోతిని వెలిగించాడు. భగత్ సింగ్ చిన్న వయసులో చూపిన దూర దృష్టి, తెగువ, భిన్నమైన ఆలోచన విధానం నేటి రాజకీయాలపై బలమైన ప్రభావం చూపుతోందని, విటల్ రావు అన్నారు.భగత్ సింగ్ చిన్న వయసులోనే ఉరికొయ్యను ముద్దాడడని, ఆయన త్యాగం వృధా కాలేదని నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. మా దేహం ముక్కలు అవుతున్న ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమనే భగత్ సింగ్ నినాదంతో డివైఎఫ్ఐ ముందుకు సాగాలని, అనేక ఉద్యమాలు నిర్వహించాలని,ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, సిపిఎం మండల కమిటీ సభ్యులు తడికమళ్ళ చిరంజీవి, మిట్టపల్లి.నాగమణి,కండే సత్యం, చిమట విశ్వనాథం, సి.ఐ.టి యు. నాయకులు మిద్దె. స్వామి, తేజావత్ రాములు, మల్లెల వెంకటేశ్వరరావు, నాగయ్య, సత్యం,ప్రసాదు, శీను, నాగరాజు ఇతరులు పాల్గొన్నారు.
