మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం – 08/02/2025 శనివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామానికి చెందిన రావిలాల పవన్ సాయి 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకి మండల పాడు లంకపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.
పవన్ సాయికి తలకు బలమైన గాయం కావడంతో పెనుబల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పవన్ సాయి శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచాడు. దీనితో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మునీరుగా విలపిస్తుండడంతో మండలపాడు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Source:mana tv6 news