మన టివి6 న్యూస్ ( క్రీడావార్తులు మనకోసం-03/02/2025 సోమవారం) డిఫెండింగ్ ఛాంపియన్ గా సిరీస్ పోటీపడి రెండో సారి మహిళల అండర్-19 టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నాను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులు అన్నారు.
సమిష్టి ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించి అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని. టోర్నీ మొత్తం తనదైనశైలితో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అద్భుత ప్రదర్శన చేసిన మన తెలంగాణ ముద్దు బిడ్డ అందులోనూ మన భద్రాచలం కు చెందిన క్రికెటర్ గొంగడి త్రిష మన అందరికీ గర్వకారణంగా నిలిచారని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు అన్నారు.
భవిష్యత్తులో భారత మహిళా క్రికెట్
జట్టు ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులు తెలియజేశారు.
