మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మన కోసం 02/02/2025 ఆదివారం). ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి, డిల్లీ, బీహార్ ఎన్నికల కోసం పెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు,ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయంజరిగిందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య సురేష్ నాయక్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రభుత్వ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసి, పేద ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కార్పొరేట్లకు అనుకూలంగా కేవలం ఢిల్లీ, బీహార్ ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ప్రవేశపెట్టినట్లుది. తెలంగాణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎలాంటి కేటాయింపులు లేకుండా పెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ అనీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్ లో ప్రజలకు అతి ముఖ్యమైన విద్య రంగానికి,వైద్య రంగానికి, ఉద్యోగాల కల్పనకు కావాల్సిన అధిక నిధులను కేటాయించలేదని,యల్.ఐ.సి లాంటి అనేక భీమా రంగ ప్రభుత్వ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలలో విదేశీ, కార్పొరేట్ పెట్టుబడులను పెట్టే విధంగా రూపకల్పన చేశారని, బడ్జెట్ లో ముఖ్యంగా నిత్యవసర, పెట్రోల్, డిజిల్ ధరలను పెంచి పేద ప్రజలపై తీవ్ర భారాలను మోపారని, బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని సురేష్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం త్వరలో జరగబోయే డిల్లీ, బీహార్ ఎన్నికలలో బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించి ఎన్నికలలో దొడ్డి దారిలో గెలవాలని పెట్టిన బడ్జెట్ లాగా ఉందని, బీజేపీ, యన్.డి.ఏ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ నిధులు కేటాయించారని, తెలంగాణకు అధిక నిధులు కేటాయించ లేదని సురేష్ నాయక్ అన్నారు.
బడ్జెట్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అనేక ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కానీ, యూనివర్సిటీ ఏర్పాటుకు కానీ, భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ కి, ప్రాజెక్టుల, పరిశ్రమల స్థాపనకు కానీ అసలు నిధులు కేటాయించకపోవడంతో తీవ్ర అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. వెంటనే కేంద్ర బడ్జెట్ నీ సవరించాలని లేని యెడల దేశ, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.
