మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం. 08/02/2025 శనివారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని తాళ్లపంట గ్రామ సమీపంలో ఉన్నటువంటి పులి గుండాల పర్యాటక కేంద్రం పరిసర ప్రాంతాలలో చిరుత పులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులకు ఆధారాలు లభించాయి.
ఇటీవల కాలంలో పులిగుండాల పర్యాటక కేంద్రాన్ని ఎకో టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తున్న క్రమంలో సమీపంలోని కనిగిరి గుట్టల పరిసర ప్రాంతాలలో యంత్రాలతో పనులు చేస్తున్నారు. ఈ యంత్రాల శబ్దాలకు చిరుత బెదిరి బయటికి వచ్చి ఉండవచ్చని ప్రజలు అనుమానిస్తున్నారు.
కొంతకాలం నుండి ఉన్నతాధకారుల ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇక్కడకు పిక్నిక్ గా వస్తున్నారు. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఆందోళనకరంగా ఉంది. అయితే భవిష్యత్తులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలియజేశారు.
బ్రహ్మాలకుంట పరిసర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చిరుతపులి కనిపించిన లేక పాదముద్రలు కనిపించిన వెంటనే తమకు తెలియజేయాలని అటవీస్ అధికారం అటవీశాఖ అధికారులు ప్రజలను కోరారు.
